పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

సెల్వి

శనివారం, 18 మే 2024 (15:22 IST)
2019 నుంచి పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు (మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట), నరసరావుపేట పార్లమెంటును గెలుచుకుంది. 
 
ఎన్నికల తర్వాత టీడీపీ కోడెల శివప్రసాదరావు లాంటి నాయకుడిని కోల్పోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి టీడీపీ కేడర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలకు పడదు. 
 
ఇక 2024 మే 13న జరిగిన పోలింగ్ రోజున పల్నాడులో టీడీపీ క్యాడర్ హోరాహోరీగా పోరాడింది. పోలింగ్ బూతులో రిగ్గింగ్‌కు పాల్పడింది వైకాపా. పోలింగ్ తర్వాత టీడీపీ క్యాడర్ కూడా గట్టిపోటీనిచ్చింది. పల్నాడులో ఎన్నికల ఫలితాల కథ ముందే తెలిసే.. వైకాపా ఇలాంటి చర్యలకు పాల్పడిందని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు