స్వైన్ ఫ్లూ భయంతో వణికిపోతున్న కర్ణాటక

స్వైన్ ఫ్లూ భయంతో కర్ణాటక వణికిపోతోంది. రాష్ట్రంలోని పలు విద్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. శుక్రవారం ఫ్లూ భయంతో కర్ణాటకలోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీకి 10 రోజులు శెలవు ప్రకటించారు. దీనికి కారణం గత పదిరోజుల వ్యవధిలో ఈ వ్యాధికారణంగా 20మంది మృత్యువాతపడటమే.

యూనివర్శిటీలో ఎవరికీ స్వైన్ ఫ్లూ వ్యాధి సోకలేదనీ, కేవలం ముందస్తు జాగ్రత్తగానే 10 రోజులు శెలవు ప్రకటించామని వైస్ ఛాన్సలర్ వెంకటరావు తెలిపారు. తమ పొరుగునే ఉన్న నాగర్భవి యూనివర్శిటీలో స్వైన్ ఫ్లూ కారణంగా మరణం చోటుచేసుకోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇదిలావుండగా కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి 16 ఏళ్ల అమ్మాయి స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందినట్లు వైద్య అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ స్వైన్ ఫ్లూ వ్యాధి కారణంగా మృతి చెందినవారి సంఖ్య 20కి చేరినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి