స్వైన్‌ఫ్లూ వ్యాధికి చిట్కాలు

స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడకుండా నేడు చాలామంది మాస్క్‌లు ధరించి వెళుతున్నారు. ఇలా మాస్క్ ధరించడం కొందరికి చిరాకుగా ఉంటుంది. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం...

థైమాల్, మెంతాల్, కర్పూరం సమపాళ్ళల్లో కలుపుకోండి. వీటిని రుమాలు(చేతిగుడ్డ)లో లేదా టిష్యూ పేపర్‌పై వేసుకుని వాసన చూడండి. దీంతో జన సమర్థం కలిగిన ప్రదేశాలలో మాస్క్ లేకుండా నిర్భయంగా తిరుగాడవచ్చంటున్నారు వైద్యులు.

** తమలపాకుపై మూడు చుక్కల ఈ మిశ్రమాన్ని కలిపి ప్రతి రోజు రెండుపూటలా సేవించాలి. ఇలా ఐదు రోజులపాటు చేస్తుంటే స్వైన్‌ఫ్లూ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ.

** 100 మిల్లీ లీటర్ల నీటిలో మూడు గ్రాముల వేప, తిప్ప తీగ, నేల వేముతోపాటు అరగ్రాము మిరియాలు మరియు ఒక గ్రాము సొంఠిని కలిపి ఉడికించాలి. ఇది అరవై మిల్లీ లీటర్లయ్యే వరకు కాగనిచ్చాలి. ఈ మిశ్రమాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది. ఇలా ఓ వారంపాటు ప్రతి రోజు పరకడపున వాడితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఈ వ్యాధి దరి చేరదంటున్నారు వైద్యులు.

** త్రిఫలా, త్రికాటూ, మధుయాస్తీ మరియు అమృతను సమపాళ్ళలో కలుపుకుని ప్రతి రోజు ఓ చెంచా మిశ్రమాన్ని సేవిస్తుంటే జ్వరంబారిన పడరు. ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన తర్వాత రెండు పూటలా తీసుకుంటే ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి