నామినేషన్ వాసిలో కొంతమంది వద్ద ఉన్న ఆయుధాలకు కొదవలేదు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభ్యర్థుల తమ వద్ద ఉన్న ఆయుధాలను కూడా స్థానిక పోలీసు స్టేషన్‌లో సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 4 వేలకు పైగా ఆయుధాలు సరెండర్(డిపాజిట్) చేశారు. అయితే, ఆయుధాలను అత్యధికంగా కలిగివున్నవారిలో ఎంఐఎం అభ్యర్థులే కావడం గమనార్హం.
చాంద్రాయణగుట్ట స్థానం నుంచి పోటీ చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ వద్ద 3 ఆయుధాలు ఉన్నాయి. వాటివిలువను కూడా అఫిడవిట్‌లో చూపించారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన .22 పిస్టల్, 30-06 రైఫిల్, బోర్ డీబీబీఎల్ తుపాకీ ఒకటి.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వద్ద ఓ ఫిస్టల్‌తో పాటు. రైఫిల్ ఉన్నాయి. ఈ రెండూ బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో లైసెన్స్ నంబరు 821 కింద నమోదయ్యాయి. అలాగే, బహదూర్‌పురా స్థానం నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి మొజంఖాన్, చార్మినార్ నుంచి బరిలోకి దిగుతున్న మజ్లిస్ అభ్యర్థి ముంతాజ్ ఖాన్, నాంపల్లి స్థానం నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్, ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఫెరోజ్‌ల వద్ద ఆయుధాలు ఉన్నాయి. వీరంతా ఆయుధాల్లోనే కాదు ఆస్తిలోనూ శ్రీమంతులుగా కొనసాగుతున్నారు.