తెలంగాణ ఎన్నికల షెడ్యూల్.. ఓటర్ల వివరాలు...

సోమవారం, 19 నవంబరు 2018 (17:13 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగిపోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు డిసెంబర్ 7వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం 119 సీట్లకుగాను అధిరాక తెరాస మొత్తం సీట్లలో పోటీ చేస్తుంటే, ఎంఐఎం 8, బీజేపీ 119, కాంగ్రెస్94, టీడీపీ 14, సీపీఐ 3, తెలంగాణ జనసమితి 8 సీట్లలో పోటీ చేస్తోంది. మొత్తం 2.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1.38 కోట్ల మంది పురుషులు, 1.35 కోట్ల మంది స్త్రీలు, 2663 మంది హిజ్రా ఓటర్లు ఉన్నారు. 
 
కాగా, ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, డిసెంబరు 7వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకాగా, డిసెంబరు 19వ తేదీ సాయంత్రంతో నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. 20వ తేదీన నామినేషన్లను పరిశీస్తారు. 22వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే వెసులుబాటువుంది. డిసెంబర్ 7వ తేదీన ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 11వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. డిసెంబరు 13వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు