ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థి సుధాకర్ రావును గెలిపిస్తే సోమశిల - సిద్ధేశ్వరం వంతెన నిర్మిస్తామన్నారు. అలాగే, సోమశిల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. తెలంగాణాలోని జాతీయ రహదారులను అనుసంధానిస్తామని వెల్లడించారు.
ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న సుధాకర్ రావు ఉన్నత విద్యావంతుండని, మంచి ఇంజనీరింగ్ నిపుణుడని చెప్పారు. పైగా, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అందువల్ల ఆయన్ను గెలిపించాలని కోరారు.
పైగా, కొల్లాపూర్‌లో ఆస్పత్రులు లేవు.. ఒకవేళ ఎక్కడో ఓ చోట ఆస్పత్రి ఉంటి వైద్యులు ఉండరని ఎద్దేవా చేశారు. అలాగే, పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా లేరన్నారు. అనేక స్కూళ్లను మూసివేస్తున్నారని తెలిపారు. 20యేళ్లుగా ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని చెబుతున్నారు… అందుకే అభివృద్ధిని పట్టించుకోని నాయకులను ఇంటికి పంపండని, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సుధాకర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే జాతి, కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని నితిన్ గడ్కకరీ హామీ ఇచ్చారు.