Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

చిత్రాసేన్

మంగళవారం, 21 అక్టోబరు 2025 (17:33 IST)
Dil Raju, Kiran Abbavaram, Jains Nani, Yukthi
కిరణ్ అబ్బవరం నటించిన K-ర్యాంప్ మూవీ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈ సినిమా రిలీజైన 3 రోజుల్లోనే 17.5 కోట్ల రూపాయల వసూళ్లను అందుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
 
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ - 47 రోజుల్లో సినిమాను కంప్లీట్ చేశాం. టీమ్ ఎఫర్ట్ వల్లే అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగాం. కిరణ్ అన్న ఎనర్జీ, ప్యాషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఎస్ ఆర్ కల్యాణమండపం చూసి ఆయన ఫ్యాన్ అయ్యాను. నేను 90's కిడ్ ను. థియేటర్ బయట మౌత్ టాక్ చూసి సినిమాకు వెళ్లేవాడిని. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రివ్యూస్ వచ్చి భయపెడుతున్నాయి. రివ్యూస్ వారి వ్యక్తిగత విషయం నేను గౌరవిస్తాను. సినిమా బాగుంటే ఏవీ పట్టించుకోము అని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూ మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు అన్నారు.
 
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - డైరెక్టర్ నాని చేసిన కథకు మంచి ప్రొడ్యూసర్స్ దొరకడం, కిరణ్ లాంటి హీరో ఉండటం..అన్నీ కలిసి ఈ రోజు థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. నా సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయి రాజేశ్ దండ ప్రొడ్యూసర్ అయ్యారు. నేనూ అలాగే రామానాయుడు గారిని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా ఆర్య 2 మూవీకి పీఆర్ చేసిన ఎస్ కేఎన్ ప్రొడ్యూసర్ అయి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్నాడు. రైట్ కంటెంట్ ను తీసుకుని ఇన్వాల్వ్ అయి సినిమా నిర్మిస్తే ప్రేక్షకులు తప్పకుండా విజయాన్ని ఇస్తారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ కామన్. అయితే కష్టడేవారికి ఏదో ఒక రోజు సక్సెస్ దక్కుతుంది. సక్సెస్ బాటలో వెళ్తున్న యంగ్ ప్రొడ్యూసర్స్ అందరికీ నా అభినందనలు అన్నారు
 
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ - మా అబ్బాయి ఆది యూఎస్ నుంచి ఫోన్ చేసి ఇక్కడ షోస్ బాగా పికప్ అయ్యాయి అని చెప్పాడు. K-ర్యాంప్ కు ప్రేక్షకులు మంచి విజయాన్ని ఇచ్చారు. ఈ టీమ్ అందరికీ మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - ప్రతి సినిమాకు కష్టపడి పనిచేస్తాం.."K-ర్యాంప్" సినిమాకు కూడా అలాగే వర్క్ చేశాం. కానీ ఏదో మ్యాజిక్ మమ్మల్ని డ్రైవ్ చేస్తూ వచ్చింది. ప్రతి టీమ్ మెంబర్ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. డీవోపీ సతీష్, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్..ఇలా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. మా ప్రొడ్యూసర్ రాజేశ్ గారు ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. ఈ సినిమాను ఇంకా ప్రేక్షకులకు రీచ్ చేసేందుకు ఏం చేద్దామని అడుగుతుంటారు. రాత్రి 9 తర్వాత షూటింగ్ కు ఇంట్రెస్ట్ చూపని నరేష్ గారు మా మూవీకోసం తెల్లవారుఝామున 3వరకు షూటింగ్ చేశారు.
 
క తర్వాత అలాంటి కంటెంట్ ఉన్న థ్రిల్లర్స్ చేయాలనుకున్నాను. డైరెక్టర్ నాని ఈ సినిమా కోసం పదే పదే వెంటపడ్డాడు. ఎంటర్ టైన్ మెంట్ నీ బలం అన్నా మంచి ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్ చేయి అన్నా అన్నాడు. ఇది పండగ సినిమా అని చెబుతూ వస్తున్నాం. ఏదో గొప్ప కథ చెప్పడం లేదు మిమ్మల్ని నవ్విస్తామని క్లియర్ గా చెప్పాను. డే 1 డిజప్పాయింట్ అయ్యాము.

నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తా. ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాకు కూడా ఇలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే నేను బలంగా నమ్మాను. "K-ర్యాంప్"ను కూడా బలంగా నమ్మాను. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నా కెరీర్ లో జరిగిన బిగ్ థింగ్ "K-ర్యాంప్". ప్రతి షో హౌస్ ఫుల్ అవుతూ వస్తోంది. మా సినిమాను నిలబెట్టిన ప్రేక్షకులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా కెరీర్ లో ఇంతకంటే పెద్ద సక్సెస్ లు రావొచ్చు కానీ మా నమ్మకాన్ని నిలబెట్టిన విజయమిది. ఇక్కడా మనమంతా సమానమే, ఎవరూ చిన్నా కాదు ఎవరూ పెద్దా కాదు. మీడియా మిత్రులు కాస్త సపోర్ట్ చేస్తే, మాలాంటి వాళ్లం ఇంకా బలంగా నిలబడతాం. కిరణ్ అబ్బవరం సినిమా అంటే నమ్మకంగా థియేటర్స్ కు వెళ్లొచ్చు అనేలా సినిమాలు చేస్తానని మాటిస్తున్నా. అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు