తెలంగాణా "రగడ" పొడింగించబడింది: రైల్ రోకోలు.. ముట్టడిలు షురూ
సోమవారం, 26 సెప్టెంబరు 2011 (17:00 IST)
సకలజనుల సమ్మె ఉధృతితో తెలంగాణా ప్రాంత ప్రజల బతుకు చిత్రం దాదాపు ఛిద్రమయ్యే పరిస్థితికి వచ్చేసిందనే చెప్పుకునే పరిస్థితి. కరెంటు కటకటతో చేతుల్లో పనిలేక బడుగుజీవి బెంబేలెత్తిపోతున్నాడు.
ఇంకోవైపు తెలంగాణా జేఏసీ మాత్రం తనదైన శైలిలో రోకోలు, ర్యాలీలు, ముట్టడులు, బంద్‌లతో చెలరేగిపోతున్నది. తాజాగా జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మరోసారి తేదీలవారీగా ఆందోళన కార్యక్రమాలు ప్రకటించేశారు.
ఆ జాబితా ఇలా ఉంది... 27న పట్టాలపై ఒక్క రైలు వెళ్లకూడదు... రైల్ రోకోలు 28న తెలంగాణలో వంద కేంద్రాల్లో ర్యాలీలు 29న రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి 30న తెలంగాణలో చీమ కూడా కదలరాదు.. బంద్‌కు పిలుపు అక్టోబరు1న కాగడాల ప్రదర్శన... కరెంటు లేదని తెలియజెప్పేందుకే.. 2న టోల్‌గేట్ల్ పన్ను బహిష్కరణ 9,10,11 తేదీల్లో రైల్ రోకోలు.. రైళ్లు కదలరాదు ఇంకా మరిన్ని ఆందోళన వివరాలను త్వరలో తెలియజేస్తామని జేఏసీ నాయకులు వెల్లడించారు.