లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన లగడపాటి!

ప్రత్యేక తెలంగాణ తెనె తుట్టె కదిలింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న సానుకూల నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ, పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్‌కు అందజేశారు. ఆ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

తమ అభిప్రాయాలను ఏమాత్రం పరిగణంలోకి తీసుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. ఇదే బాటలో మరికొంతమంది ఎంపీలు ఉన్నారు. రెండో వికెట్‌గా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇదేబాటలో మరికొంతమంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తున్నట్టు సమాచారం. అనేకంగా మరో 24 గంటల్లో వీరంతా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి