ఆంధ్రుల పాలనలో తెలంగాణ ప్రాంత ఆలయాలకు తీవ్రమైన అన్యాయం జరిగిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమిత చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత దేవుళ్లు, దేవాలయాల గురించి ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.
వచ్చే ఏడాది లోపు తెలంగాణ వస్తుందనీ, రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని ఆలయాలన్నిటికీ వైభవాన్ని తీసుక వస్తాన్నారు. ముఖ్యంగా వేములవాడ ఆలయానికి 200 ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలను నిర్మించనున్నట్లు తెలిపారు.
దేవాలయాలను కూడా విభజించి పాలించు అన్నట్లు ఆలయాలను జీర్ణావస్తకి వెళ్లిపోయి శిథిలమవుతున్నా ప్రభుత్వం ఏమీ తెలియనట్లు నటిస్తోందని మండిపడ్డారు.