Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

సెల్వి

గురువారం, 6 ఫిబ్రవరి 2025 (16:26 IST)
Accident at Begumpet Airport
బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఓ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి రన్ వే నుంచి పక్కకు ఒరిగిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ముందు చక్రం వంగిపోవడంతో రన్ వే ను చీల్చుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. దీంతో రన్ వే దెబ్బతింది. 
 
ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ల్యాండ్ అవుతూ అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పాడైన రన్ వేను ప్రస్తుతం అధికారులు మరమ్మత్తులు చేపట్టారు. దీంతో బేగంపేట విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నట్లు సమాచారం. 

బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం

ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్

అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయిన ఎయిర్ క్రాఫ్ట్

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ పైలట్ pic.twitter.com/GXDhuA7qrs

— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు