ఇపుడు సినీ నటి జయసుధ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆమె భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నంచి పోటీ చేయాలని భావించి, టిక్కెట్ కోసం యత్నించారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మేకల సారంగపాణికి టిక్కెట్ కేటాయించింది.
విమానంలో విండో సీటు కావాలా... రూ.2 వేలు చెల్లించాలి...
తమ ప్రయాణికులకు ప్రైవేట్ విమాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన విమానాల్లో విండో సీటు కావాలనుకునేవారికి ఓ ఆఫర్ ప్రకటించింది. విండో సీటు కావాలంటే రూ.2 వేలు చెల్లించాలని తెలిపింది.
ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ 'లెగ్ రూమ్' ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000 ఫిక్స్డ్ ఛార్జీ నిర్ణయించింది. ఇక విండో సీటు బుకింగుపై రూ.2000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్సైట్ పేర్కొంది. 222 సీట్లు ఉండే ఏ321 విమానం ముందు వరుసలో విండో సీటు బుకింగుపై రూ.2000, నడక దారి సీటు బుకింగుపై రూ.1500, అదేవరుసలోని రెండో, మూడో సీట్ల బుకింగుపై రూ.400 ఛార్జీలు ఉంటాయని తెలిపింది. 232 సీట్లు ఉన్న ఏ321 ఫ్లైట్, 180 సీట్లు ఉన్న ఏ320 ఫ్లైట్‌పై కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.