తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

సెల్వి

సోమవారం, 23 డిశెంబరు 2024 (20:19 IST)
అఘోరాలు ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపమాచరిస్తుంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకు వస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరీ ఎప్పుడూ లేనంతగా న్సూసెన్స్‌ క్రియెట్‌ చేసింది. గత నెల 18వ తేదీన మంగళగిరి ఆటోనగర్ ఆల్ఫా హోటల్ ఎదుట ఓ కార్ వాష్ సెంటర్ వద్ద అఘోరీ జరిపిన దాడిలో గాయపడిన ఆరేపల్లి రాజు అనే మీడియా ప్రతినిధి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. 
 
కవరేజ్ కోసం వెళ్తే.. అఘోరీ తన కారులో ఉన్న ఇనుప రాడ్డును తీసుకొని విలేకరితోపాటు కార్ వాష్ సెంటర్లో ఉన్న యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో విలేకరి కాలు విరిగి తీవ్ర గాయాలపాలవగా స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.
 
కాగా సదరు ఘటనలో పోలీసులు అఘోరిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని తెలిపారు. తనపై దాడికి పాల్పడిన అఘోరీపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి)కు బాధితుడు ఫిర్యాదు చేశారు.
 
అటు వరంగల్ జిల్లా మామునూరు పీఎస్‌లో నవంబర్ నెలలో అఘోరీపై కేసు నమోదైంది. కోడిని బలిచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో.. కరీంనగర్‌కు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయటంతో అఘోరిపై కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు