ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

సెల్వి

ఆదివారం, 2 నవంబరు 2025 (12:35 IST)
ASI
నిర్లక్ష్యంగా కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల అశ్రద్ధగా వుండటం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
పీయస్ ఆర్ గార్డెన్‌లో పోలీసులు పరేడ్ నిర్వహిస్తుండగా, అనారోగ్యంతో పక్కన నిలబడ్డ ఏఎస్ఐ దేవీసింగ్ (60)ను అతివేగంగా వచ్చిన నీళ్ల ట్యాంకర్ ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏఎస్ఐ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

మేడ్చల్ జిల్లా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.ఎస్.ఆర్. గార్డెన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు పరేడ్ జరుగుతున్న సమయంలో ఆరోగ్యం సహకరించక పక్కన నిలబడ్డ ఏఎస్‌ఐ దేవిసింగ్ (60)ను ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. గార్డెన్స్ నుండి బయటకు… pic.twitter.com/cI4VOq85MG

— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025

వెబ్దునియా పై చదవండి