ఎటూ కాకుండా ఇరుక్కున్న చిలిపి రాజయ్య!

ఠాగూర్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (10:59 IST)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పాటైన తొలి ప్రభుత్వంలో చక్రం తిప్పిన టి.రాజయ్య ఇపుడు ఎటూ కాకుండాపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. కానీ, ఢిల్లీలో రాజయ్యను కాంగ్రెస్ పెద్దలు కలవడానికి మొహం చాటేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించిన స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు హస్తం నేతలు హ్యాండిస్తున్నారు. 
 
సొంత నియోజకవర్గంలోని మహిళలు శనివారం నాడు పెద్ద ఎత్తున గాంధీ భవన్‌కు చేరుకుని రాజయ్యను పార్టీలో చేర్చుకుంటే చెప్పులతో కొడతాం అంటూ ధర్నా చేశారు. రాజయ్య చేరికకు మొదట్లో ఓకే చెప్పిన రేవంత్ రెడ్డి.. సొంత పార్టీలో వస్తున్న నిరసనల నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. 10వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతానని మీడియాకు లీకులు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళిన రాజయ్యకు ఢిల్లీ పెద్దలు మొహం చాటేశారు. తన నేపథ్యం, బలాల గురించి వివరిస్తూ 30 లేఖ రాసి మల్లిఖార్జున్ ఖర్గేకు పంపినా ఆయన అపాయిట్మెంట్ ఇవ్వకపోగా కేసీ వేణుగోపాల్ సైతం అదే బాటలో మొహం చాటేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు