హైదరాబాద్ నగర వాసులకు అలెర్ట్... ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్!!

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (10:10 IST)
హైదరాబాద్ నగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ నగర జల మండలి అధికారులు ఓ హెచ్చరిక చేశారు. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కృష్ణా రెండో పంపు హౌస్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల గురువారం రోజంతా తాగునీటి సరఫరా ఉండదని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
 
కృష్ణా రెండో పంపు హౌస్ మరమ్మతుల కారణంగా వివిధ ప్రాంతాల్లో పూర్తిగాను, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిగంగాను నీటి సరఫరాను నిలిపివేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, ఎల్బీ నగర్, బాలాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, ఉప్పల్, రామంతపూర్, బద్వేల్, శంషాబాద్, తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు