బెంగుళూరులో అల్‌ఖైదా కదలికలు.. మద్దతుదారు అరెస్టు

ఠాగూర్

శుక్రవారం, 8 ఆగస్టు 2025 (10:20 IST)
ఐటీ నగరం బెంగుళూరులో అల్‌ఖైదా కదలికలు కనిపించాయి. తాజాగా ఆ సంస్థ మద్దతురాలు శమా ఫర్వీన్ (30)ను అరెస్టు చేశారు. ఆమె వద్ద జరిగిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ), గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులు సంయుక్తంగా ఆమెను విచారించారు. ఈ సందర్భంగా ఆమె అనేక ఆసక్తకర విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బెంగులూరు నగరాన్ని పేల్చివేయడానికి పాకిస్థాన్ ఆర్మి అసీమ్ మునీర్‌ను కోరినట్టు ఆమె వెల్లడించింది. 
 
సోషల్ మీడియాలో అసీమ్ మునీర్ చిత్రాన్ని పోస్టు చేసిన ఫర్వీద్ భారతదేశంలోని ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలను ఏకీకరణ చేయాలని కోరింది. ఆమె సోషల్ మీడియా ఖాతాకు దాదాపు 10 వేల మంది ఫాలోయర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇందులో ఆమె తన సిద్ధాంతాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్టు ఎన్.ఐ.ఏ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు