సితా గ్రాండ్ హోటల్ ఓయో గదిలో హిడెన్ కెమెరా... కస్టమర్లను బ్లాక్ మెయిల్..

ఠాగూర్

బుధవారం, 28 ఆగస్టు 2024 (16:10 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఉన్న సితా గ్రాండ్ హోటల్ ఓయో గదిలో యజమాని హిడెన్ కెమెరా అమర్చి, ఆ హోటల్‌కు వచ్చే కస్టమర్ల సన్నిహిత దృశ్యాలతో బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌‍కు పాల్పడుతున్న గుట్టురట్టయింది. ఓ జంట ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఓయో హోటల్ యజమాని ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. విచారణలో ఈ తంతు చాలా కాలంగా సాగుతున్నట్టు, చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బుతోపాటు పలు రకాలైన లబ్ధిపొందినట్టు వెల్లడైంది. 
 
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. శంషాబాద్ సితా గ్రాండ్ హోటల్‌ నిర్వాహకుడు ఓయోతో ఒప్పందం కుదుర్చుకుని జంటలకు గదులు అద్దెకు ఇవ్వసాగాడు. ఈ క్రమంలో తన హోటల్‌లోని గదులలో రహస్యంగా హిడెన్ కెమెరాలు అమర్చాడు. ఆ గదిలో దిగినవారు సన్నిహితంగా గడిపినదంతా ఆ కెమెరాల ద్వార రికార్డు చేశాడు. ఆపై ఆ వీడియోలు చూపిస్తూ జంటలను బెదిరించసాగాడు. తమకు డబ్బు ఇస్తే వీడియోను డిలీట్ చేస్తానని లేకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగసాగాడు. 
 
దీంతో పలువురు జంటలు ఈ బ్లాక్‌మెయిల్‌కు భయడి ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి ఆ వీడియోలు డిలీట్ చేయించుకోనేవారు. అయితే, ఓ యువ జంటను కూడా ఇలాగే బెదిరించాలని చూశాడు. వారు ధైర్యం చేసి ఎదురుతిరగడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సితా గ్రాండ్ హోటల్‌లో సోదాలు చేపట్టి ఓయో గదుల్లో అమర్చిన హిడెన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు