టీఎస్సార్టీసీకి చెందిన రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంగళవారం రాత్రి, కుషాయిగూడ బస్ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక బస్సులో మంటలు చెలరేగి, ఆ బస్సులు దగ్గరగా ఉండటం వల్ల త్వరగా మరొక బస్సుకు వ్యాపించాయి. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై.. అగ్నిమాపక దళానికి సమాచారం అందజేశారు.