రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

దేవి

మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (10:44 IST)
Vijay Devarakonda
రామ్ చరణ్ నటించిన గేమ్ చెంజర్ ఫలితం తెలిసిందే. తాజా ఓ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ రచయిత, నిర్మాత, దర్శకుడు అయిన నిఖిల్ నగేష్ భట్ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. సమాచారం మేరకు, ఆర్. ఆర్. ఆర్. తో వచ్చిన ఇమేజ్ తో ఆయనతో పౌరాణిక చిత్రం చేయాలనీ అనుకున్నారట. ఇటీవలే కిల్ సినిమాకు దర్శకత్యం చేసిన నిఖిల్ నగేష్ భట్ భారీగా సినిమా తెయాలని ప్లాన్ చేసారు. 
 
కాగా, ఈ బాలీవుడ్ చిత్రనిర్మాత ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండను కలిశారని పుకార్లు వచ్చాయి. గతంలో విజయ్‌దేవకొండ తో  లైగర్‌ను నిర్మించిన కరణ్ జోహార్ ఈ వెంచర్‌కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి, అధికారిక ధృవీకరణ లేదు. ఈ సహకారం కార్యరూపం దాల్చినట్లయితే, అది విజయ్ దేవరకొండకు బలమైన బాలీవుడ్ పునరాగమనాన్ని సూచిస్తుంది. హిందీ చిత్రసీమలోకి సక్సెస్‌ఫుల్‌ ఎంట్రీపై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
 
ఇటీవలే విజయ్‌దేవకొండను కర్ణుడి గా కల్కి లో నాగ్ అశ్విన్ చూపించాడు. ఆ గెటప్ కు పేరు వచ్చింది. ఇక, విజయ్ దేవరకొండ లేటెస్మట్రి గా కింగ్ డం సినిమాలో బిసీ గా ఉన్నారు. మరి బాలీ వుడ్ సినిమా  విషయాలు ఎలా జరుగుతాయో వేచి చూద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు