మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ -మహిళ మృతి.. 20మందికి అస్వస్థత

సెల్వి

సోమవారం, 28 అక్టోబరు 2024 (15:47 IST)
హైదరాబాదులోని ప్రముఖ రెస్టారెంట్స్‌లో ఆహారం నాణ్యత కరువైంది. బిర్యానీల్లో జెర్రీలు, కప్పలు కనబడిన దాఖలాలున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఫుడ్‌స్టాల్‌లో మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ మహిళ చనిపోగా, మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. 
 
గత శుక్రవారం మోమోస్‌ తిని అస్వస్థతకు గురైన బాధితులు సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ స్టాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు