తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోటీని తీవ్రతరం చేస్తూ వారిద్దరూ తరచూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు 1000 ఎకరాల్లో ఫామ్‌హౌస్ ఉందని, కేటీఆర్‌కు కూడా 100 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందని పలు ప్రెస్మీట్లు, ఈవెంట్లలో రేవంత్ రెడ్డి ఆరోపించారు.