కాగా, తాజాగా పెంచిన ధరల మేరకు.., క్వార్టర్ బాటిల్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 చొప్పున పెంచేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు ప్రతి నెల అదనంగా రూ.160 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందని అబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, పేద మద్యం బాబులు తాగే చీఫ్ లిక్కర్ ధరను మాత్రం ప్రభుత్వం పెంచలేదు.