రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ఠాగూర్

శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (11:36 IST)
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం జరిగింది. రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక మైనర్ బాలికను ఓ దుండగుడు లైంగికంగా వేధించడంతో పాటు వీడియోలను చిత్రీకరించాడు. బాధితురాలిని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బాలికగా గుర్తించారు.
 
బాధితురాలి తండ్రి రంజన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేల్జార్ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రంజన్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన తన కుమార్తెను అక్కడే ఉన్న ఓ దండగుడు వేధింపులకు గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
సుమారు అర్థగంటపాటు బాలికను లైంగికంగా వేధించారని, తన మొబైల్ ఫోనులో వీడియోలు కూడా రికార్డు చేశాడని తెలిపారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పగా వారు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని అతని ఫోనులో ఉన్న అన్ని వీడియోలను పరిశీలించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడుపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు