పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

ఠాగూర్

శుక్రవారం, 28 మార్చి 2025 (09:24 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపిపెట్టింది. ఆ తర్వాత తాను కూడా ఆరగించింది. ఈ ఘటలో ముగ్గురు పిల్లుల ప్రాణాలు కోల్పోగా, ఆ తల్లి మాత్రం ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
స్థానిక రాఘవేంద్ర నగర్‌ కాలనీకి చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు గురువారం రాత్రి పెరుగన్నంలో విషం కలిపి పెట్టింది. ఆ తర్వాత తాను కూడా ఆరగించింది. దీంతో ముగ్గురు పిల్లలు ఇంట్లోనే చనిపోగా, ఆ మహిళ మాత్రం అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ మహిళను రజితగా గుర్తించారు. చనిపోయిన చిన్నారులను సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8)గా గుర్తించారు. తాను, పిల్లలకు విషం కలిపిన పెరుగన్నం ఆరగించి, తన భర్త చెన్నయ్యకు మాత్రం పప్పు అన్నంపెట్టింది. దీంతో పెరుగన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే చనిపోయారు. 
 
సమాచారం తెలుసుకున్న ముగ్గురు పిల్లుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి విషమంగా ఉంది. కాగా, కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

పిల్లల మృతికి కుటుంబ కలహాలే కారణమా..?

పెరుగన్నంలో విష పదార్థాలు కలిపి, ముగ్గురు పిల్లలకు పెట్టి తాను కూడా తిన్న తల్లి.
తల్లి పరిస్థితి విషమం.. ముగ్గురు పిల్లలు మృతి.
పిల్లల మృతికి కుటుంబ కలహాలే కారణమని అంటున్న స్థానికులు.
భర్త పని మీద బయటకు వెళ్లి వచ్చేసరికి దారుణం. https://t.co/djFzd5RsGn pic.twitter.com/SCGroY9yIU

— ChotaNews App (@ChotaNewsApp) March 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు