తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు.. ఊడిపడుతున్న భవనం పెచ్చులు

ఠాగూర్

గురువారం, 13 ఫిబ్రవరి 2025 (09:34 IST)
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్తగా సచివాలయ భవనాన్ని నిర్మించింది. రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు ఈ సచివాలయ భవనాన్ని నిర్మించారు. అయితే, ఈ భవన నిర్మాణంలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా సచివాలయ భవనంలో పైపెచ్చులు ఊడిపడి ఒక  కారు ధ్వంసమైంది. 
 
సచివాలయ భవనంలోని ఆరో అంతస్తు నుంచి పెచ్చులు ఊడిపడి, పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 
 
సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉండటం గమనార్హం. రూ.వందల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం నుంచి పెచ్చులు ఊడిపడటం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు