జొన్న పిండి, సజ్జ పిండితో తయారు చేసిన రుచికరమైన రొట్టెలను తెలంగాణ వాసులు ఆహారంలో భాగం చేసుకుంటారు. తద్వారా తెలంగాణ వాసులు ఆరోగ్యానికి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నారు. తెలంగాణ వంటకాలు అంటేనే విదేశీయులు ఎంతో ఇష్టపడతారు. దమ్ బిర్యానీ, హలీమ్ వంటి ప్రసిద్ధ వంటకాలు పచ్చి పులుసు, సర్వ పిండి వంటివి ఇతర ప్రాంతీయులకు ఎంతగానో ఇష్టపడతాయి.
తెలంగాణ వంటకాల్లో చిరుధాన్యాలు, చింతపండు, సుగంధ ద్రవ్యాలు వంటివి ఉపయోగించడం వల్ల తెలంగాణ ఆహారానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అంతేకాదు.. మిగిలిపోయిన చపాతీలతో రుచికరమైన లడ్డు తయారు చేయవచ్చని ఎంతమందికి తెలుసు. తెలంగాణ ప్రజలు మలిదలు అనే ఈ రుచికరమైన డెజర్ట్ తయారు చేస్తారు. మీరు దీన్ని ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు.
మీరు చేయాల్సిందల్లా చపాతీలను ముక్కలుగా చేసి ముతకగా రుబ్బుకోవడమే. బెల్లం, నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని లడ్డులుగా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ జోడించడం ద్వారా దీన్ని ఆరోగ్యకరంగా, రుచికరంగా చేయవచ్చు.