కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్‌కి రామోజీరావు లేఖ.. చాలా బాధ కలిగింది..
శనివారం, 9 డిశెంబరు 2023 (22:35 IST)
KCR_Ramoji Rao
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ వ్యాపారవేత్త రామోజీ రావు స్పందించారు. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖ రాశారు. ఈ విషయం తెలియగానే తనకు చాలా బాధ కలిగిందని లేఖలో రామోజీరావు పేర్కొన్నారు.
తుంటి మార్పిడి కోసం ఆయనకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందన్న వార్త ముదావహమన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్‌కి రాసిన లేఖలో రామోజీరావు పేర్కొన్నారు.
తన వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో ఎదురైన ఎన్నో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొన్న కేసీఆర్... ఈ సవాలును అవలీలగా అధిగమిస్తారనీ, కొన్ని వారాల విశ్రాంతి అనివార్యమని రామోజీ రావు అన్నారు.