విద్యార్థులను కరిచిన ఎలుకలు... వీడియో వైరల్

వరుణ్

గురువారం, 11 జులై 2024 (20:15 IST)
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ ఎలుకలు ఏకంగా 12 మందిని కరిశాయి. ఇద్దరు విద్యార్థినిలు అర్థరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచి చూడగానే కాళ్లు, పాదాలకు గాయాలై నెత్తురు కారుతుండటాన్ని చూసుకొని భయాందోళనలకు గురయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. 
 
తొమ్మిదో వతరగతికి చెందిన 12 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో ఎలుకల స్వైర విహారం

12 మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు

ఇద్దరు విద్యార్థినిలు అర్ధరాత్రి దాటాక ఉలిక్కిపడి లేచి చూడగానే కాళ్లు, పాదాలకు గాయాలై నెత్తురు కారుతుండటాన్ని చూసుకొని భయాందోళనలకు గురయ్యారు.

మెదక్ జిల్లా రామాయంపేటలోని తెలంగాణ… pic.twitter.com/ob3UZJEUfX

— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు