బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతున్నదని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నదని చెప్పారు.