కాగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో నిర్మించిన ఓ అక్రమ కట్టడాన్ని హైడ్రా అధికారులు రెవెన్యూ సిబ్బంది, పోలీసుల సహకారంతో కూల్చేశారు. ఈ నిర్మాణం చేపట్టిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. చెరువు ఒడ్డున కాకుండా ఏకంగా చెరువులోనే నాలుగు అంతస్తుల భవనం నిర్మించారు.
చెరువు ఒడ్డు నుంచి బిల్డింగ్ వద్దకు చేరుకోవటానికి స్కైవాక్ తరహాలో మెట్ల నిర్మాణం చేపట్టారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ కోటీశ్వరుడు దాదాపు దశాబ్ద కాలం క్రితం ఈ బిల్డింగ్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ కూల్చివేతల్లో అపశృతి చోటుచేసుకుంది. బాంబులతో బిల్డింగ్ కూల్చేవేతలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు తెలుస్తోంది.