వర్షిణి ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో మరోసారి వీరి వ్యవహారం వెలుగుచూసింది. వర్షిణి ఎవరో తెలియదని అఘోరి, అఘోరి ఎవరో తెలియదని వర్షిణి ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో వర్షిణి తనపై వస్తున్న విమర్శలకు సెల్ఫీ వీడియోలో సమాధానం ఇస్తూ అఘోరీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
అఘోరీ తొలి పెళ్లి గురించి అబద్ధం చెప్పిందని.. తను చెప్పిన విషయాలన్ని నమ్మినట్లు వర్షిణి వివరించింది. దాని తర్వాత మనం పెళ్లి చేసుకుందామని, పెళ్లి చేసుకుంటే వారికి సమాధానం ఇచ్చినట్లు ఉంటుందని నమ్మించాడని తెలిపింది. అతనితో జరిగింది అసలు పెళ్లే కాదని.. అఘోరీతో వెళ్లి చాలా పెద్ద తప్పు చేశానని వర్షిణి వెల్లడించింది. తను ట్రాప్ చేసి మోసం చేశాడని ఆరోపించింది.
"అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? అంటూ వర్షిణి ఏకిపారేసింది. అఘోరీ వల్ల తన కుటుంబం ఇబ్బందుల్లో పడింది. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అల్లూరి శ్రీనివాస్ అంటూ ఫైర్ అయ్యింది. నిజాలు మాట్లాడు లేదంటే.. చెప్పుతీసుకుని కొడతా.. ఇంకోసారి .. నా గురించి, నాఫ్యామిలీ గురించి మళ్లీ మాట్లాడితే... నీ అంగం కోసేస్తా అఘోరీ.. దమ్ముంటే నాతో డైరెక్ట్‌గా మాట్లాడు" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వర్షిణి.