మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

సెల్వి

సోమవారం, 2 డిశెంబరు 2024 (15:09 IST)
Sub-inspector Nandigama
నందిగామ సబ్ ఇన్స్పెక్టర్ బి. అభిమన్యు మానవత్వాన్ని చాటారు. నందిగామ పట్టణం మెయిన్ బజార్లో శ్యామ్ బాబు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఎండలో కూర్చొని చెప్పులు కుట్టడం గమనించారు. అంతే వెంటనే అతనిని నీడ కోసం గొడుగు ఏర్పాటు చేశారు. 
 
చెప్పులు కుట్టే స్థలం అని చెప్పే విధంగా బోర్డును కూడా పెట్టారు. అతను కూర్చునేలా స్టాండ్.. నీడ కోసం గొడుగుతో కూడిన చెక్కల స్టాండ్‌ను ఆ వ్యక్తికి అందించారు. తనకు సాయం చేసిన ఎస్సకి శామ్ అనే ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఇకపోతే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత , కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ, సుల్తాన్‌పూర్‌లో చెప్పులు కుట్టే వ్యక్తికి షూ కుట్టించే యంత్రాన్ని పంపారు. చెప్పులు కుట్టేవాడు రామ్ చైత్‌ను కలుసుకుని అతనికి మద్దతుగా, రాహుల్ గాంధీ షూ-స్టిచింగ్ మెషీన్‌ను పంపిన సంగతి తెలిసిందే. 

మానవత్వాన్ని చాటిన నందిగామ సబ్ ఇన్స్పెక్టర్ బి. అభిమన్యు గారు.
నందిగామ పట్టణం మెయిన్ బజార్లో శ్యామ్ బాబు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఎండలో కూర్చొని చెప్పులు కుట్టడం గమనించిన ఎస్సై గారు ..(1/2 pic.twitter.com/rl1HZlrOP9

— Vijayawada City Police (@VjaCityPolice) December 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు