ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

ఠాగూర్

గురువారం, 2 జనవరి 2025 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరిజిన్ డైరీ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి జరిపారు. 
 
పట్టణంలోని రామటాకీస్ వీధిలో ఓ బార్బర్ షాపు వద్ద ఆదివారం రాత్రి ఆదినారాయణ మరో వ్యక్తితో కలిసివున్నాడు. ఆ సమయంలో భారాస నేతలు కొందరు వచ్చి ఆదినారాయణ నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి మరీ ఈ దాడికి పాల్పడ్డారు. దండం పెట్టి వేడుకున్నా కనికరించకుండా విచక్షణారహితంగా చితకబాదారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని ఆదినారాయణ ఆరోపిస్తున్నారు. దీంతో దుర్గం చిన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
ఈ దాడిలో ఆదినారాయణకు గాయాలయ్యాయి. దీంతో ఆయన వెంట ఉన్న వ్యక్తి ఆదినారాయణను హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆదినారాయణకు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ఈ దాడికి గల కారణాలు తెలియాల్సివుంది. 


 

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి

నడిరోడ్డుపై బట్టలు ఊడదీసి మరీ దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు

దండం పెట్టి వేడుకున్నా కనికరించకుండా విచక్షణారహితంగా చితకబాదిన నేతలు

మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులే దాడి చేశారని ఆదినారాయణ ఆరోపణ

దుర్గం చిన్నయ్యపై కేసు నమోదు… pic.twitter.com/2JUQejP017

— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు