వీటిని సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది శ్రీరంగారావు దాఖలు చేశారు. అంటే భూముల కేటాయింపులు కూడా రద్దు చేసిన తొమ్మిదేళ్ల తర్వాత అక్రమాలని పిటిషన్లు వేశారు.
వీటిని ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇంకా ఈ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఇందులో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.