హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

ఠాగూర్

సోమవారం, 21 ఏప్రియల్ 2025 (16:19 IST)
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో క్షణాల్లో వాతావరణం మారిపోతుంది. ఈ కారణంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్ధిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలిపింది. 
 
ఇదిలావుంటే, సోమవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు తెలంగాణాలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు