జాజితండాకు చెందిన మంజుల, మాన్సింగ్ దంపతులకు సంగీత, సీత అనే కవలలు ఉన్నారు. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సంగీత (6) ఒకటో తరగతి చదువుతుంది.
తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో నాన్నమ్మతో వున్న సంగీత, సీత ఇంట్లో రేకులకు ఉయ్యాల కట్టుకుని ఆడారు. పక్కింటికి నాన్నమ్మ వెళ్లడంతో.. భారీ సుడిగాలి వచ్చింది. రేకులతోపాటు చిన్నారి సంగీత ఎగిరిపోయి రెండు ఇండ్ల తర్వాత ఉన్న స్లాబ్‌పై పడింది.