మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గోడకూలిపోయింది. ఈ శిథిలాల కింద ఏడుగురు మృతదేహాలను స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతులను రామ్ యాదవ్, గీత, హిమాన్షు, తిరుపతిరావు, శంకర్, రాజు, ఖుషిగా గుర్తించారు.
కాగా, గోడ కూలిందన్న సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి మొత్తం ఏడుగు మృతదేహాలను వెలికితీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా మండుటెండల నేపథ్యంలో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరవాసులకు కాస్త ఉపశమనం కలిగించింది. అయితే, పలుచోట్ల నాలాలు పొంగడం, ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు ఎదురయ్యాయి.