కారులో మంటలు: యువతితో పాటు సజీవ దహనమైన వ్యాపారి

ఐవీఆర్

సోమవారం, 6 జనవరి 2025 (19:24 IST)
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీసు స్టేషను పరిధిలో ఘోర కారు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు కారు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఘట్ కేసర్ సమీపంలోని ఘనపూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఎరిటిగా కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో వున్న ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు.
 
కారులో చెలరేగిన మంటల్లో మృతి చెందిన వారిలో శ్రీరామ్ అనే సైకిల్ హోల్ సేల్ షాప్ యజమానిగా గుర్తించారు. ఈ మంటల్లో మృత్యువాత పడిన యువతి వివరాలు తెలియాల్సి వుంది. 
 
 

కారులో ఒక్కసారిగా మంటలు.. ముగ్గురు సజీవ దహనం

ఘటకేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్‌పూర్‌లో ఘటన

కారులోనే సజీవదహనమైన ముగ్గురు వ్యక్తులు pic.twitter.com/1LVI5BaKyG

— BIG TV Breaking News (@bigtvtelugu) January 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు