పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్... 'కన్నప్ప' నుంచి మరో పోస్టర్ రిలీజ్!

ఠాగూర్

సోమవారం, 6 జనవరి 2025 (12:07 IST)
ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "కన్నప్ప". ఈ చిత్రంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా నటిస్తున్నారు. సోమవారం ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. 
 
'ముల్లోకాలు ఏలే తల్లి.. భక్తులను ఆదుకునే త్రిశక్తి! శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక పార్వతీదేవి' అంటూ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ఆమె అత్యద్భుతమైన అందం, దైవిక ఉనికికి సాక్ష్యమివ్వండి. ఆమె భక్తి, త్యాగానికి ఈ పురాణ గాథలో జీవం పోసింది అని చిత్ర యూనిట్ పేర్కొంది. 
 
కాగా, 'కన్నప్ప' చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర హీరోలు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ మూవీలోని పలు కీలక పాత్రలు తాలూకూ పోస్టర్లను చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన విషయం తెల్సిందే. కాగా, ఏప్రిల్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 

 

???? Divine Grace Personified ????

Here is the glorious full look of @MsKajalAggarwal as '???????????? ???????????????????????????? ????????????????'???? the divine union with '???????????????? ????????????????????'????, in #Kannappa????. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY

— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు