హైదరాబాద్‌లోని బండ్లగూడలో డ్యూటీ సమయంలో నిద్రపోతూ ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. బుధవారం రాత్రి కానిస్టేబుల్ షాబాజ్, హోంగార్డ్ ఇమ్రాన్ పెట్రోలింగ్‌లో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో, బండ్లగూడలోని కింగ్స్ అవెన్యూ కాలనీలో గుట్కా వ్యాపారి ఇంటి దగ్గర కారు ఆపి, అతిథుల కోసం ఏర్పాటు చేసిన గదిలో నిద్రపోయారు.