వెంటనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడు ఆమెను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు CPR (కార్డియోపల్మనరీ రిససిటేషన్)తో సహా ప్రాథమిక చికిత్స అందించారు, కానీ ఆమె స్పందించకపోవడంతో ఆమెను వేరే ఆసుపత్రికి రిఫర్ చేశారు. రెండవ ఆసుపత్రిలో శ్రీ నిధి గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మృతురాలి తల్లిదండ్రులు శ్రీనిధి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 16ఏళ్ల శ్రీ నిధి లాంటి చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.