జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

ఠాగూర్

శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (17:49 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జాబ్ మేళాను నిర్వహించింది. దీనికి నిరుద్యోగులు పోటెత్తారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ సెంటరు హాలులో నిర్వహించిన ఈ జాబ్ మేళా సందర్భంగా తొక్కిసలాట జరుపగా, ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. దీంతో కన్వెన్షన్ సెంటర్ ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగిలిపోవడంతో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఇదిలావంటే, ఈ జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. 
 
వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలి : వైఎస్ భారతి 
 
తన వదినమ్మ, వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి ఐ-టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే సైకోలను నడిరోడ్డుపై ఉరితీయాలని ఆమె డిమండ్ చేశారు. భారతి రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానమన్నారు. ఈ సైకో గాళ్ళను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ప్రోత్సహించే యూట్యూబ్ చానళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. 
 
కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదన్నారు. ఏ పార్టీకి చెందిన వాళ్లయినా, వాళ్లు ఎంతటి వాళ్ళయినా శిక్ష పడాల్సిందే. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైకాపా, టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలో ఆదర్శం.
 
అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉచ్ఛం, నీచం, మానం మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డుమీదికి లాగారు. మనిషి పుట్టుకను అవమానించి రక్షసానందం పొ దారు. అన్యం, పున్యం ఎరుగని పసిపిల్లలను సైతం లాగారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇపుడు వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి" అని షర్మిల పిలుపునిచ్చారు. 

 

ఒకవైపు జాబ్ నోటిఫికేషన్లు వద్దు అంటున్నారని చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు ఉద్యోగాల కోసం తొక్కిసలాట

వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలకు గాయాలు

వరంగల్ నగరంలోని ఏంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో తొక్కిసలాట

జాబ్ మేళాకు వేలాదిగా తరలి… https://t.co/Q7bDDPMcjC pic.twitter.com/EGy0Yd3XY1

— Telugu Scribe (@TeluguScribe) April 11, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు