తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలానికి చెందిన దంపతుల విషయంలో ఇదే జరిగింది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భార్య తన కుమార్తెను తీసుకుని భువనగిరి జిల్లా ఘట్కేసర్‌లో వుంటోంది. ఒంటరిగా వున్న ఆ మహిళపై మరిది వరసయ్యే రాము అనే వ్యక్తి కన్నేసాడు. ఆమెకు అవసరమైన పనుల్లో చేదోడువాదోడుగా వుండటంతో అతడితో ఆమె సన్నిహిత సంబంధం ఏర్పరుచుకుంది. ఫలితంగా ఇద్దరూ ఏకాంతంగా గడపడం చేస్తూ వచ్చారు.
ఐతే ఈ కామాంధుడు దృష్టి వొదినతో పాటు ఆమె 16 ఏళ్ల కుమార్తెపై పడింది. తన కోర్కె తీర్చుకునేందుకు సహకరించాలంటూ వొదినపై వత్తిడి తెచ్చాడు. అప్పటికే అతడికి పూర్తిగా లొంగియి వున్న ఆ మహిళ కుమార్తెను కూడా ఆ కామాంధుడికి అప్పగించింది. దాంతో అతడు ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఈ విషయంలో బాలిక తన అమ్మమ్మకి తెలియపరచడంతో గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అబార్షన్ చేయించారు. ఐతే విషయం బైటకు రావడంతో పోలీసులు కామాంధుడిపైన, ఆమె తల్లిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.