తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం.. షెడ్యూల్ వివరాలివే
గురువారం, 12 మే 2022 (09:04 IST)
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి విద్యార్ధులు తమ హాల్ టికెట్లు పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఇప్పటికే వెల్లడించారు.
ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది మొత్తం 5 లక్షల 8వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. విద్యార్థుల హల్ టిక్కెట్లు గురువారం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కృష్ణారావు తెలిపారు.
షెడ్యూల్ వివరాలు:
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)
మే 24- సెకండ్ లాంగ్వేజ్..
మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మే 26- మ్యాథమెటిక్స్
మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్)