బంగాళాఖాతంలో అసని తుఫాను ప్రభావం కొనసాగుతోంది. ఈ తుఫానుకు ప్రస్తుతం కొత్త ద్రోణి తోడైంది. అసని తుఫానుకు తోడు బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడిందని, ద్రోణి ప్రభావంతో రాగాల మూడు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ ద్రోణి కారణంగా దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రానున్న రెండు రోజుల్లో వాతావరణం మేఘావృతమై, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.