తార్నాకలో డ్రగ్స్ కలకలం.. 11 మంది అరెస్టు

బుధవారం, 6 ఏప్రియల్ 2022 (10:45 IST)
హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌ పబ్ ఫుడింగ్ అండ్ మింక్‌లో జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల జరిగిన సోదాల్లో డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ హోటల్ లైసెన్సును రద్దు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు మత్తుపదార్థాలను విక్రయించే వారిని గుర్తించే పనిలో నిమగ్నమైవున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే లక్ష్మీపతి అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. 
 
తాజాగా తార్నాకలో ఉస్మానియా పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కాటిక్స్ బ్యూరో విభాగం అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో 11 మంది డ్రగ్స్ విక్రేతలను అరెస్టు చేసింది. వారి నుంచి గంజాయితో పాటు.. హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తి కట్టడి చేసేందుకు పోలీసులు కంకణం కంకణం కట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు