ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం

సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:46 IST)
ఆదిలాబాద్ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం రేపింది. ఖోడద్ గ్రామంలోని 12 మత్స్యాకార కుటుంబాలపై సంఘం పెద్దలు కులబహిష్కరణ వేటు వేయడం జరిగింది. మూడేళ్లుగా నరకం చూసిన బాధితులు, ఇక వేధింపులు తాళలేక మీడియాను ఆశ్రయించారు. 
 
తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 12 మత్స్యకార కుటుంబాలపై సంఘం పెద్దలు కుల బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ఇక గ్రామంలో 72 కుటుంబాల్లో 12 కుటుంబాలను వారు వెలివేశారు. 
 
ఆరా తీయగా తాము వారిని కుల బహిష్కరణ చేయలేదని ఇంకా సంఘ భవనం నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వలేదని, ఇక అందుకే ఆ 12 కుటుంబాలను దూరంగా ఉంచామన్నారు సంఘం పెద్దలు.   

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు