ఇందులో మోహన్ బాబు మాట్లాడుతూ, "నా కుటుంబానికి ఊపిరి సినిమా. ఏమీ లేకుండా వచ్చి అంచలంచెలుగా ఎదిగి ఒక యూనివర్శిటీ అయింది. 1982లో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌ను అన్నగారితో ప్రారంభించాను. జీవితంలో కొన్ని కొన్ని రిస్క్‌లు చేశాను. అది ఇలా నిలబెట్టింది. జీవితంలో రిస్క్ లేకుండా ఏది జరగదు. రిస్క్ అనేది తగిన రీతిలో చెయ్యాలి" అని అన్నారు.
రత్నబాబు కథ చెప్పినపుడు విని వెంటనే ఓకే చేశాను. ఈ కథ విష్ణు కూడా నచ్చి సమ్మతించారు. అయితే, ఈ సినిమాలో రాజకీయం ఉంది. ఫ్యామిలీ ఉంది. పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక్క సాంగ్ కోసం డబ్బులు లెక్క చేయకుండా ఖర్చు చేశాం. బాగా కష్టపడ్డాం కూడా. దీనికి నిదర్శనమే ఈ చిత్రం చాలా బాగా వచ్చింది అని వివరించారు.