ఎయిర్ ఇండియా విమానం ఏఐ952లో బంగారం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్(డీఆర్ఐ) అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానంలోని సీట్ల నెంబర్ 31ఏ, 32ఏ కింద 112 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు.
దక్షణ కొరియా, చైనాకు చెందిన ఇద్దరు పౌరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారం విలువ రూ. 5 కోట్ల 46 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులపై 1962 కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ తరలింపులో విమాన సిబ్బంది ప్రమేయంపై ఆరా తీస్తున్నారు..